Home  »  TV News  »  రాబోయే బిడ్డ కోసం ఇప్పటినుంచి అన్నీ రెడీ చేసుకున్న నటి లహరి

Updated : Jul 31, 2023


బుల్లితెర ప్రేక్షకులకు లహరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో పద్ధతైన చీర కట్టుతో అత్తగారు మెచ్చుకునే  చక్కని పొందికైన  కోడలిగా కనిపించి అలరించింది. చిన్న చిన్న కళ్ళతో చాల ముద్దుగా ఉంటుంది లహరి. ఐతే ప్రస్తుతం లహరి నటనకు కొంచెం బ్రేక్ ఇచ్చింది.ఐతే తొమ్మిదో నెల గర్భంతో ఉన్న లహరి త్వరలో బిడ్డను కనబోతున్న టైం కాబట్టి  బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకుంటోంది.  మరి లహరికి  కుటుంబ సభ్యులు,  స్నేహితులంతా కలిసి  సీమంతం  వేడుకను నిర్వహించారు. ఇక వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో సందడి చేశారు.  లహరి సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చీరకట్టులోనే ఎక్కువగా కనిపించే ఈ ముద్దుల నటికి సోషల్ మీడియాలో క్రేజ్‌ బాగా ఉంది. చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లహరి చక్రవాకం, మొగలిరేకులు, ముద్దుబిడ్డ, ఇంటింటి గృహలక్ష్మి వంటి పలు సూపర్‌హిట్‌ ధారావాహికల్లో నటించి మెప్పించింది. లహరికి  బుల్లితెర మీద శ్రీదేవి డ్రామా కంపెనీలో సీమంతం కూడా గతంలో  జరిగింది. ఇప్పుడు ఇంట్లో ఫామిలీ మెంబెర్స్, ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఈ వేడుక సందర్భంగా అందరూ ఆమె విషెస్ చెప్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లహరి  ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను, ఫొటోస్, వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ తన హ్యాపీనెస్ ని అందరితో షేర్‌ చేసుకుంటుంది. తమ మధ్యకు త్వరలో రాబోయే  చిన్నారి కోసం ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు కూడా చేసుకుంది లహరి. బిడ్డ కోసం  చిట్టి చిట్టి దుస్తులు, చిన్న బెడ్డు, తలకు పెట్టుకునే కాప్స్, బాగ్  బెడ్‌.. అన్నిటినీ రెడీ చేసి పెట్టుకుంది. ఈ అప్ డేట్స్ అన్నిటినీ కూడా "ఓకే లహరి" అనే తన యుట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే మెటర్నిటీ డ్రెస్ కలెక్షన్ పేరుతో కూడా ఒక వీడియో చేసింది లహరి.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.